అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల అమావాస్య సందర్భంగా కూడా సమితి సభ్యులు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
“మనుషులకు సేవ చేయడమే దైవానికి సేవ చేయడం” అనే సందేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా, బాటసారులకు, వాహనదారులకు, పట్టణ ప్రజలకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో సమితి నిర్మల్ జిల్లా శాఖ నాయకులు, సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజున నిరంతరాయంగా కొనసాగుతుందని సమితి ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.











