నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
ఆగస్టు 30 కుంటాల: మండల కేంద్రంలోని పెంచికల్పహాడ్ గ్రామంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం గ్రామంలో శనివారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైంసా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నైలు నాయక్ ఆయన మాట్లాడుతూ వాహనదారుల కు డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలు కలిగి ఉండాలని, ప్రజలలో భయాందోళనలు తొలగించి చైతన్యం పెంపొందించుట కొరకు ఆకస్మిక నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని 67 ద్విచక్ర వాహనాలు 5 ఆటోలు,1 టాటా మ్యాక్స్,1 టాటా ఏస్ లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యొక్క వాహన పత్రాలను ఫిట్నెస్ డాక్యుమెంట్లను ట్రాఫిక్ చాలానా లను తనిఖీ చేశారు. బ్యాంకు సిబ్బంది పేరిట ఓటీపీలు అడిగితే చెప్పవద్దని మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీస్ అధికారులకు తెలియజేయాలని గ్రామాలలో ప్రధాన వీధుల దారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో కార్యక్రమంలో భైంసా రూరల్ ఎస్సై పోలీస్ సిబ్బంది కుంటాల ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు