- నిర్మల్ జిల్లా దిలావార్‌పూర్ మండలంలో గురుకుల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య.
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి 17 ఎకరాల 09 గుంటల భూమి పరిశీలన.
- భవన నిర్మాణానికి సంబంధించిన స్థల సేకరణ, ప్రణాళికలు అధికారుల నుండి తెలుసుకున్న కమిషనర్.
- భవనాల నిర్మాణం అన్ని హంగులతో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ.
- సమీక్షలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, ఇతర అధికారుల పాల్గొనడం.
నిర్మల్ జిల్లా దిలావార్‌పూర్ మండలంలో గురుకుల పాఠశాల భవన నిర్మాణ స్థలాన్ని ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి 17 ఎకరాల 09 గుంటల స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణ ప్రణాళికలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ ప్రాంగణాన్ని ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య బుధవారం పరిశీలించారు. దిలావార్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామ సమీపంలోని 17 ఎకరాల 09 గుంటల స్థలాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా భవన నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, భవనాల నిర్మాణ ప్రణాళికలు, అవసరమైన అనుమతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు, విద్యార్థులకు అన్ని హంగులతో కూడిన సౌకర్యాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, భవన నిర్మాణాలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఆర్ అండ్ బి ఈఈ అశోక్ కుమార్, డిఐఈఓ పరశురాం, డిఈ గంగాధర్, తాహసిల్దార్ స్వాతి, ఏఈ తుకారం తదితరులు పాల్గొన్నారు.