బైంసా మార్కెట్ లో రైతుల నిలువు దోపిడి
మితిమీరిపోతున్న కమిషన్ ఏజెంట్లు ఆగడాలు..
మార్కెట్ కాంటాలు లేక మోసపోతున్న రైతులు
నగదు ఇవ్వాలంటే వెయ్యి రూపాయలకు 30 రూపాయలు కట్
మామూలుగా తీసుకుంటున్న మార్కెట్ కమిటీ అధికారులు.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 20



నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ లో. రైతులకు నిలువు దోపిడీ జరుగుతుంది. ముధోల్ నియోజకవర్గం లో వేలాది ఎకరాలల్లో సోయా పంట పండడంతో అమ్మకానికి రైతులు పంటను మార్కెట్ కు తెస్తే కొనుగోలుదారులు, కమిషన్ ఏజెంట్లు, రైతులను నిలువుగా దోచుకు తింటున్నారు. పంట అమ్మిన తర్వాత నగదు డబ్బులు ఇవ్వాలంటే 1000 కి 30 రూపాయలు కట్ చేస్తున్నారు. ఒక రైతు 25 క్వింటాళ్ల సోయా అమ్మితే లక్ష రూపాయలు కమిషన్ ఏజెంట్ వద్ద తీసుకోవాలంటే 3000 రూపాయలు కట్ చేసి ఇస్తున్నారు. అంటే ప్రతి నిత్యం బైంసాలో కోట్ల రూపాయల్లో మార్కెట్ జరుగుతుంది. అంటే కమిషన్ ఏజెంట్ దారులు రైతులకు కోటి రూపాయల నగదు ఇస్తే మూడు లక్షల రూపాయలు దోచుకుంటున్నారన్నమాట. ఈ తతంగమంతా నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, బహిరంగ రహస్యమైనప్పటికీ మార్కెట్ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. రైతు కష్టపడి పంట పండిస్తే, మార్కెట్ కు తెచ్చి అమ్ముదాం అనుకుంటే కమిషన్ ఏజెంట్ దారులు నిబంధనలకు విరుద్ధంగా రైతుల రక్తం తాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు. ఒక ఎకరంలో రైతు పంట పండిస్తే రైతుకు పెట్టుబడి ఖర్చులు పోను మిగిలేది ఎకరానికి పది నుంచి 15000 రూపాయలు మాత్రమే. కమిషన్ ఏజెంట్ దారులు ఆ రైతు నుండి వేళలో దోచుకుంటుంటే ఇక అధికారులు ఎందుకు ఉన్నట్టు… ఇదిలా ఉంటే కొనుగోలుదారుల తీరు మరి అధ్వానం క్వింటాలు కు రెండు కిలోల కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గిస్తున్నట్లు ఆరోపణలు రైతుల నుండి వినిపిస్తున్నాయి. దీనికి తోడు రైతుల పంటకు తూకం వేయాలంటే మార్కెట్ అధికారులు, మార్కెట్ కాంటాలు ఏర్పాటు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏజెంట్లు తమ దుకాణాల ముందు సొంత కాంటాలను ఏర్పాటు చేసి తూకంలో మోసం చేస్తున్నారన్న ఆరోపణల సైతం ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ కమిటీ దడివాయిల ప్రమేయం లేకుండా తూకం వేస్తున్నారు.. తక్ పట్టి లో దడివాయి ల పేరిట వెళ్లిన డబ్బులు కమిషన్ ఏజెంట్లే వారి జేబుల్లో వేసుకుంటున్న మార్కెట్ కమిటీ అధికారులు ఎందుకు కిమ్మనడంలేదో అర్థం కావడం లేదు. ఇకనైనా అధికార యంత్రాంగం, స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు