ఆడేల్లి శ్రీ మహాలక్ష్మీ పోచమ్మ దేవస్థానంలో మాలధారణ ప్రారంభం – నవంబర్ 7న కొత్త విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

ఆడేల్లి శ్రీ మహాలక్ష్మీ పోచమ్మ దేవస్థానంలో మాలధారణ ప్రారంభం – నవంబర్ 7న కొత్త విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

ఆడేల్లి శ్రీ మహాలక్ష్మీ పోచమ్మ దేవస్థానంలో మాలధారణ ప్రారంభం – నవంబర్ 7న కొత్త విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

వేదపండితులు చంద్రశేఖర్ శర్మ, శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు మాలధారణ స్వీకారం – ఆలయ చైర్మన్ బోజా గౌడ్, ఈఓ భూమయ్య ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి

సారంగాపూర్, అక్టోబర్ 28 (మనోరంజని – తెలుగు టైమ్స్ ప్రతినిధి):

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధి చెందిన ఆడేల్లి శ్రీ మహాలక్ష్మీ పోచమ్మ దేవస్థానంలో మంగళవారం భక్తులు ఆధ్యాత్మిక భక్తి భావంతో మాలధారణ స్వీకరించారు. వేదపండితులు చంద్రశేఖర్ శర్మ మరియు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మాలధారణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ చైర్మన్ బోజా గౌడ్ మాట్లాడుతూ – “అమ్మవారి ఆశీస్సులతో ఈ మాలధారణ స్వీకారం భక్తులకు శుభపరిణామం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి” అని తెలిపారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి భూమయ్య మాట్లాడుతూ – “అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నవంబర్ 7న శుక్రవారం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక వైభవోపేతంగా మహోత్సవం జరగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి” అని తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. ఆడేల్లి తల్లి ఆశీస్సులతో ప్రతి భక్తుని జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండాలని ఆలయ అధికారులు ఆకాంక్షించారు

Join WhatsApp

Join Now

Leave a Comment