గణనాథుని హారతిలో పాల్గొన్న కలెక్టర్
మనోరంజని ప్రతినిధి, భైంసా | సెప్టెంబర్ 4
భైంసా మండలం మంజ్రి గ్రామంలో గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ పూజలు నిర్వహించారు.
గ్రామంలో జరిగిన ఈ హారతి కార్యక్రమంలో భైంసా ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు