భూ భారతితో రైతులకు మేలు భూభారతి చట్టంపై అవగాహన కల్పించిన కలెక్టర్ అభిలాష అభినవ్
జనతన్యూస్ ఏప్రిల్ 29 కుంటాల: మండల కేంద్రంలోని అందాకూర్ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ వేదిక నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వారు మాట్లాడుతూ భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భూ సమస్యలను పరిష్కరించి భూ యజమాన్య హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని అన్నారు. భూమి పరిష్కారం గాని సమస్యలకు కొత్త భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములపై పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు వీలు కలుగుతుందని వివరించారు. రైతులకు వేగవంతంగా న్యాయం లభిస్తుందని చిన్న సన్న గారి రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుందని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసిల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో లింబాద్రి, ఏవో విక్రమ్, డిప్యూటీ తాసిల్దార్ నరేష్ గౌడ్, ఆర్ ఐ లు రెవెన్యూ వ్యవసాయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు పోలీస్ సిబ్బంది గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు