తెలంగాణ తల్లి విగ్రహం పై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం

: తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, సీఎం రేవంత్ రెడ్డి
  1. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం.
  2. విగ్రహ రూపకల్పనలో చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తి.
  3. తెలంగాణ సాధన చరిత్రకు దర్పంగా రూపుదిద్దిన విగ్రహం.
  4. విగ్రహంపై ప్రతిపక్ష విమర్శలపై సీఎం స్పందన.

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంపై భావోద్వేగ ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు పునాదిరాయి పడిన 2009 డిసెంబర్ 9 తేదీకి గుర్తుగా ఈరోజు సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ రూపకల్పనలో చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తిని తీసుకొని రూపొందించామన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా స్పందించిన సీఎం, తెలంగాణ తల్లి రూపాన్ని జనానికి వివరించారు.

హైదరాబాద్: డిసెంబర్ 09
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై భావోద్వేగ ప్రసంగం చేశారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వెలువడిన రోజుని గుర్తు చేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం చరిత్రాత్మక రోజు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించడంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిఫలించిందని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ తల్లి రూపాన్ని చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో తీర్చిదిద్దాం. మెడకు కంటె, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడక, పంటలతో కూడిన రూపం తెలంగాణ తల్లిదే. కుడిచేతిలో జాతికి అభయం, ఎడమ చేతిలో పంటలతో తల్లి రూపం ప్రజలకు గర్వకారణం అవుతుంది,” అని పేర్కొన్నారు.

తెలంగాణ తల్లి రూపంపై వస్తున్న ప్రతిపక్ష విమర్శలను గట్టిగా తిప్పికొడుతూ, “తల్లి రూపానికి కిరీటం ఉండదు, అది దేవతలకు మాత్రమే ఉంటుంది,” అన్నారు. విగ్రహ రూపకల్పనను చరిత్రకు దర్పంగా తయారు చేశామని, ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment