ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి

M4News (ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 11, 2024

తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శ్రీకారం చుట్టారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్య అందించాలన్న లక్ష్యంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

తొలిదశలో 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలను కొనసాగిస్తూనే, అత్యాధునిక వసతులతో సమీకృత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం భవన నిర్మాణాల కోసం భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, “గత 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు వారు ఏమి చేయలేదు” అని అభిప్రాయపడ్డారు.

“పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10,006 పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు, ఉద్యోగ ఉన్నతిని అందించడంలో ఇందిరమ్మ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం అనేక స్కూల్స్ ఏర్పాటు చేసినా, పక్క వసతుల విషయంలో విఫలమైంది” అని చెప్పారు.

Leave a Comment