*మేడారంలో అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి!*
*మనోరంజని: ప్రతినిధి*
ములుగు జిల్లా: సెప్టెంబర్23
రెండేళ్ల ఒక్కసారి జరిగే మహా జాతరతో పాటు.. ఏడాది పొడుగునా మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకునేం దుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మేడారం చేరుకున్నారు.
సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, రావడంతో వారికీ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, వడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వాగతం పలికారు.
అనంతరం 12:40 గంట లకు గిరిజన పూజారులు గిరిజన సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ముఖ్యమంత్రి, మంత్రులు గద్దెల ప్రాంతానికి తీసుకు పోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చిరే సారా సమర్పించారు. దీంతో పాటు తన ఎత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించారు.
ఈ సందర్భంగా పూజారుల తో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా చేపట్ట వలసిన పనుల పై గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ విషయం పై చర్చించారు.