చౌట్ పల్లి కోటి లింగేశ్వరుని కళ్యాణం కమనీయం
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 27
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో హన్మండ్ల భక్తుల వంశీయులు గంగాప్రసాద్ భువన దీక్షితులు ఆధ్వర్యంలో ప్రతీ ఏటా జాతర కోటిలింగేశ్వర జాతర ఉత్సవాలు జరుగుతాయి. హంపీ పీఠాధిపతులు, మాధవానంద సరస్వతీ సద్గురు కరకముల చేత ఈ ఆలయ ప్రతిష్ట జరిగి ఈరోజు 14వ స్వామివారి కల్యాణ మహోత్సవానికి మాధవానంద సరస్వతీ స్వామి వారు విచ్చేసి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ కోటిలింగేశ్వరుని వేడుకుంటున్నట్టు ఆశీర్వదించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఈ సందర్భంగా గంగాప్రసాద్ దీక్షితులు మాట్లాడుతూ,, ఈ జాతర మహోత్సవాలకు చౌట్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, ప్రజలు, అధికారులు అందరూ స్వచ్ఛందంగా సహకరించిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ ఆలయం అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని,అన్నప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. పెద్ద ఎత్తున భక్త జనం మధ్యలో కన్నుల పండుగ గా ఎంతో అంగరంగ వైభవంగా కోటి లింగేశ్వర కల్యాణం జరగడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు.