*సమర్థవంతమైన అభ్యర్థుల జాబితాను ఎంపిక చేయండి: సీఎం రేవంత్ రెడ్డి!*
*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*
హైదరాబాద్:అక్టోబర్ 09
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్,ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావటం మొదటి విడత నామినేషన్లు ధాఖలు ప్రారంభం అయిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, గురువారం మంత్రుల రివ్యూ సమావేశం నిర్వహించారు.
జిల్లా అధ్యక్షులు కీలక నేతలు కార్యకర్తలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియపై అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, అన్నారు అభ్యర్థులను ఖరారు చేసి బీ”ఫారం ఇవ్వాలని, నో డ్యూ పత్రాలు ఇప్పించాలని ఆదేశించారు
పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడా రు.ఇన్‌ఛార్జి మంత్రులు.. ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలి. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్, పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయిస్తుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసుపై పీసీసీ చీఫ్ పర్యవేక్షించాలి. తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలి అని సూచించారు.