అనాధ బాలుడును చేరదిసిన బాలల సంక్షేమ సమితి.

అనాధ బాలుడును చేరదిసిన బాలల సంక్షేమ సమితి.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

నిర్మల్ : అక్టోబర్ 14 )

అభం-శుభం తెలియని ఆనాధ బాలుడిని జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది సోమవారం చేర దీశారు. వివరాల్లోకి వెళ్తే చిన్నప్పుడే అమ్మ, నాన్నలను కోల్పోయిన అనాధ బాలుడు వెల్మల కుమార్(06) వివిధ ప్రాంతలలో సంచరిస్తూ భిక్షాలన చేస్తున్నాడు. నిర్మల్ పట్టణంలోని లంగ్డాపూర్ గ్రామానికి చెందిన తన మేనమామ తో భిక్షాటన చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం సోన్ మండలంలోని బొప్పారంలో 1098 చైల్డ్ లైన్ సిబ్బంది చేరదీసి బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశ పెట్టగా వారు బాలుడిని విచారించి అనాధగా గుర్తించి భైంసా పట్టణంలోని శ్రీ వివేకానంద ఆవాసంలో ప్రవేశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బాలల సంక్షేమ సమితి అద్యక్షుడు ఎండి. వాహెద్, సభ్యులు శ్రీలలు, సైమన్ సుందర్, అనిల్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది దేవి. మురళి, సగ్గం.రాజు వీస. శ్రీనివాస్, శైలజ, లక్ష్మణ్ ,మమత కరుణశ్రీ 1098 సిబ్బంది నల్ల గంగాధర్,. సుప్రియ, శ్రీదేవి తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment