కొల్లాపూర్ నియోజకవర్గం పర్యటనలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొల్లాపూర్ నియోజకవర్గంలోనీ పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలోనీ పెంటవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి అండగా ఉంటామని, ఆ దిశగా కొల్లాపూర్‌కు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. కొల్లాపూర్ అభివృద్ధిపై మంత్రి దామోదర రాజనర్సింహాతో సమీక్షించాక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్ లు, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.