ఛత్రపతి శివాజీ జయంతి నేడు
ధైర్యానికి ప్రతిరూపం చత్రపతి శివాజీ.
నేటి తరాలకు స్ఫూర్తి ప్రదాత.
ఛత్రపతీ శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం, ధర్మస్థాపన కోసం తన ఎంతో పోరాటం చేశారు. మొఘలులను, ఎంతో మంత్రి కరుడుగట్టిన రాజుల్ని సైతం ఎదిరించి మట్టికరిపించారు. అంతే కాకుండా దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించాలని కూడా మంచి మెస్సెజ్ ను ప్రజలకు ఇచ్చారు. అలాంటి గొప్ప యోధుడి అడుగు జాడల్లో మనం అంతా నడవాలని పెద్దలు చెప్తుంటారు.అయితే.. శివాజీ జయంతి వేళ ఆయనలో ఉన్న విధంగా ధైర్యసాహాసాలు, మంచి తనం, అన్యాయంను ఎదుర్కొనే సాహాసం, ధర్మస్థాపనకు, అధర్మంను కూకటి వేళ్లతో పేకిలి వేసేందుకు అవసరమైతే ఎంతకైన పోరాడాలని నీ సందేశం చరిత్రలో నిలిచిపోయింది. ధైర్యసాహాసాలకు మారు రూపం.. ఎత్తుకు పైఎత్తు వేసే అపర చాణక్యుడు.. హిందు ధర్మం కాపాడిన దురంధరుడు, పరాయిలకు సింహాస్వప్నం అయిన శివాజీ మహారాజ్ ఆశీర్వాదాలు మీకు ఉండాలని కోరుకుంటూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంత్రి శుభాకాంక్షలు.
శివాజీ జయంతి ప్రాముఖ్యత
1.భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి: శివాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి స్వతంత్ర హిందవి సామ్రాజ్యాన్ని స్థాపించారు.
2.రాజకీయ మేధస్సు: ఆయన తెలివితేటలు, యుద్ధతంత్రాలు, శత్రువులపై వ్యూహాత్మక దాడులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.
3.ప్రజాహిత పాలన: శివాజీ రాజ్యపాలనలో ధర్మబద్ధమైన, సమానత్వపూరిత పాలన ఉండేది.
4.మరాఠా గర్వసింహం: శివాజీ భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు.
5.యుద్ధకళా ప్రావీణ్యం: గెరిల్లా వార్‌ఫేర్లో ఆయన ప్రావీణ్యత ప్రపంచ యుద్ధతంత్రంలో ప్రత్యేకమైనది.
జయంతి ఉత్సవాలు
మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 19న శివాజీ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు.ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.విద్యాసంస్థలు, రాజకీయ వేదికలపై శివాజీ మహిమను వివరిస్తూ సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు.ముంబయి, పుణే, రాయఘడ్ కోటల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.శివాజీ జయంతి కేవలం ఒక ఉత్సవమే కాదు, భారతీయ సంస్కృతి, ఆత్మగౌరవం, ధైర్యానికి ప్రతీక. ఆయన జీవిత స్ఫూర్తిని నేటి తరానికి అందించడమే నిజమైన జయంతి ఉత్సవం!