చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ తనిఖీ
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 17
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ, జిల్లా సర్వే నెంబర్ అధికారి డాక్టర్ నాగరాజ్, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ రమేష్, ఆర్మూర్ డివిజన్ మలేరియా అధికారి ప్రవీణ్ కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి, మందుల నిల్వలు, రికార్డులు, వినియోగ వివరాలను ఆడిట్ చేశారు. సిబ్బందితో మాట్లాడి సేవా నాణ్యత, ప్రజలకు అందించే వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక PHC వైద్యాధికారి డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, ఫార్మసిస్ట్ అరుణ్, ల్యాబ్ టెక్నీషియన్ పవన్, డీఓ మధు తదితరులు పాల్గొన్నారు