- ఆరుగోలనుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రజల మోసం
- పూజలు చేయాలని నమ్మించి 61 వేల రూపాయల మోసం
- ఇత్తడి బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాల మాయ
- తూరపాటి బాలయ్య అనే నకిలీ స్వామిని అరెస్ట్
ఏలూరు జిల్లా నూజివీడు సర్కిల్ పరిధిలో ఆరుగోలనుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో నకిలీ స్వామీజీగా హల్చల్ చేసిన తూరపాటి బాలయ్యను చాట్రాయి పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో రెండు కుటుంబాల వద్ద రూ.61,000 కాజేసి పరారైన అతను, ఇత్తడి బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాల మాయ చూపించేవాడిగా గుర్తించారు. ప్రజలు నకిలీ స్వామీజీలను నమ్మవద్దని, ఎలాంటి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ కే.వి.వి.ఎన్.వి ప్రసాద్ సూచించారు.
ఏలూరు జిల్లాలో నకిలీ స్వామీజీ వ్యవహారం హల్చల్ సృష్టించింది. నూజివీడు సర్కిల్ పరిధిలోని ఆరుగోలనుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో తూరపాటి బాలయ్య అనే వ్యక్తి, స్వామీజీగా పూజలు చేస్తే కుటుంబం బాగుంటుందంటూ రెండు కుటుంబాల వద్ద రూ.61,000 తీసుకుని పరారయ్యాడు.
ఇత్తడి రేకు బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాలు చూపించి, ప్రజలను మోసం చేస్తున్న ఈ స్వామీజీకి సంబంధించిన సమాచారం అందుకున్న చాట్రాయి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతడిని పోలవరం వెళ్తుండగా అరెస్ట్ చేశారు.
డీఎస్పీ కే.వి.వి.ఎన్.వి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలు నకిలీ స్వామీజీలకు బలి కావొద్దని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.