ఏపీపీఎస్పీ ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు!

ఏపీపీఎస్పీ ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు!

ఏపీపీఎస్పీ ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు!

 అమరావతి:జులై 31

 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నియామకాల్లో వేగం పెంచేలా నూతన మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

ఈ సంస్కరణలతో ఇకపై ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయనుంది. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ ప్రత్యక్ష నియామకాలలో అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తూ వస్తుంది. అయితే దీన్ని ఇకపై రద్దు చేయనుంది. అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించిన పుడు మాత్రమే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.

దీంతో చాలా పోస్టులు ఇకపై ఒక్క మెయిన్స్ పరీక్షతోనే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మార్పులు అమలులోకి వస్తే ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒకే పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగు తుంది. ఏపీపీఎస్సీ చేసిన ప్రతిపాదనల్ని ప్రభుత్వం అధికారికంగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కొత్త విధానం అకడమిక్‌ గా, అడ్మినిస్ట్రేటివ్‌గా కూడా ఈజీ కావడంతో భవిష్యత్‌ లో మెజారిటీ ఉద్యోగ నియామకాలకు ఇది వర్తించే అవకాశముంది

Join WhatsApp

Join Now

Leave a Comment