అంబరాన్నంటిన స్నేహితుల దినోత్సవ సంబరాలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూన్న డాక్టర్ సా పండరి
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఈ రోజు 2000-2001 పదవతరగతి విద్యా సంవత్సరానికి సంబంధించిన మిత్రులందరు ఒక్క దగ్గర సమావేశమయ్యారు. సందర్భంగా”””వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి””-దాగుడుమూతల దండకోర్ వీరి పేరేమి””” “””పోలీసులు వస్తున్నారు-ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సంబర్ బుడ్డి అంటూ”””లాంటి ఆటలు ఆడి చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.””” శ్రీకృష్ణుడు-కుచేలుడు”””వలె అందరూ కలిసిమెలిసి, నలుగురికి ఆదర్శంగా ఉండాలని తెలియజేశారు. చిన్నప్పటి ఆటలను గుర్తుకు చేసుకొని,ఆటలు ఆడి చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రస్తుత కాలంలో అందరూ ప్రస్తుత కాలంలో బిజీగా ఉండడం వలన,ఒకరినొకరు కలవడం కరువైందని,ఇకపై అందరూ కష్టసుఖాలలోనే కాకుండా,వీలైనంత మట్టుకు ప్రతిరోజు కలుసుకోవాలని, అందుబాటులో లేని వారు చరవాణి ద్వారా బాగోగులు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులు మేర సతీష్,అల్కే పోతన్న, ఏ.దత్తాత్రి,సూది పీరాజీ,ఫయాజ్,వడ్ల ప్రకాష్, చంద్రశేఖర్ షాహానే, పోశెట్టి నాయుడి, ఏ ప్రభు మిత్రులందరు కలుసుకొని తీపి పదార్థాలు ఒకరికి ఒకరు తినిపించుకొని ఆప్యాయతలను పంచుకున్నారు.