సారంగాపూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు.
-నేడు డిల్లీలో రేపు గల్లి లో బీజేపీ పార్టీ దే విజయం.
-ఆప్ – కాంగ్రెస్ పార్టీ లను చిత్తు చిత్తు గా ఓడించిన డీల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు.
మనోరంజని ప్రతినిధి
సారంగాపూర్ : ఫిబ్రవరి 08
నిర్మల్ జిల్లా – సారంగాపూర్ ,
దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి అఖండ విజయం
సాధించిన సందర్భంగా సారంగాపూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల నాయకుల సంబరాలు జరుపుకున్నారు.
మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు..డిల్లో లో బీజేపీ రేపు గల్లి లోను బీజేపీ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్ పార్టీని ఢిల్లీ ప్రజలు తిరస్కరించి అవినీతి రహిత పార్టీకి పట్టం కట్టారని అన్నారు. తెలంగాణలో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ని ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు.
కార్యక్రమం లో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కాల్వ నరేష్, సీనియర్ నాయకులు రామ్ శంకర్ రెడ్డి, సాహెబ్ రావు, గంగా రెడ్డి చెన్న రాజేశ్వర్,సామల వీరయ్య,నర్సయ్య, ఎల్లన్న,తిరుమల చారి,కరుణ సాగర్ రెడ్డి,లక్ష్మణ్, భీమా లింగం, అంబాజీ, శివరాం శేఖర్, రాము, నారాయణ పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు