- గద్వాల చీర తాయారు చేసే కళను ముగ్గుల రూపంలో ప్రదర్శించిన మహిళా కళాకారులు
- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీలో ప్రత్యేక ముగ్గు వేడుకలు
- కంచుకోట కొమ్మ, హంస బార్డర్ డిజైన్లతో గద్వాల చీరల స్ఫూర్తితో కళాత్మక ముగ్గులు
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్బంగా మహిళా చేనేత కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గద్వాల చీరల ప్రత్యేకతలను ముగ్గుల రూపంలో ఇంటి ముందు వేయడం ద్వారా పండుగ స్ఫూర్తిని మరింత ఉత్సాహభరితం చేశారు. కంచుకోట కొమ్మ, హంస బార్డర్ డిజైన్లతో ముగ్గులు ఆవిష్కరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళా చేనేత కళాకారులు ప్రత్యేక ముగ్గుల వేడుకలు నిర్వహించారు. గద్వాల చీరలు తమ ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ చీరల ప్రత్యేకతను చూపించేందుకు కంచుకోట కొమ్మ, చిన్న కోట కొమ్మ, హంస బార్డర్ వంటి డిజైన్లతో కళాత్మకంగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి పండుగను జరుపుకున్నారు.
ఈ వేడుకలో kenche పద్మావతి, లక్ష్మీ, జ్యోతి, మాధవి తదితర మహిళా చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఈ ముగ్గులు గద్వాల చీరల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇంటి ముందు ఈ రంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.