రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సిసిఐ కొనుగోలు కేంద్రాలు
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మార్కట్ లో పత్తి రైతుకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సిసిఐ కొనుగోళ్లు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మార్కెట్ యార్డ్ లో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలోనే రైతంగానికి మద్దతు ధరలు పెరిగాయి అన్నారు..
రైతులకు ఇబ్బంది పెట్టవద్దని, అధికారులకు సూచించారు.12 తేమ శాతం ఉంటే క్వింటాలుకు 7521 రూపాయల ధర ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ మార్కెట్ లో ధర తక్కువ ఉన్న నేపథ్యంలో రైతులకు ధర రావాలన్న ఉద్దేశ్యంతో సిసిఐ కొనుగోళ్లపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్ మాట్లాడుతూరైతుల సమస్యల పరిష్కారం కోసం మార్కెట్ కమిటీ పాలక వర్గం పాటు పడుతుందన్నారు. నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటానని ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్, డైరెక్టర్లు, నాయకులు, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.