సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.. ఏ ఎస్ పి అవినాష్ కుమార్
నిర్మల్ జిల్లా కుంటాల ఏప్రిల్ 30: కుంటాల మండల కేంద్రంలోని ఓలా గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో బైంసా ఏ.ఎస్.పి అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో నారి శక్తి అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఐ నాయుడు నాయక్ కుంటాల ఎస్సై అశోక్ నారి శక్తి మహిళా కానిస్టేబుల్ సరిత అశ్విని కుంటల పోలీస్ సిబ్బంది గ్రామస్తులందరికీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బైంసా ఏ ఎస్ పి అవినాష్ కుమార్ పోలీసు అధికారులు వారు మాట్లాడుతూ మండలంలోని గ్రామ ప్రజలందరూ సైబర్ నేరాల వారిన పడకుండా మోసపోకుండా ప్రజలు ఎప్పటికప్పుడు ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిపారు. గ్రామాలలో అమాయక ప్రజలను వలవేసి మోసం చేస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని విలాసవంతమైన వస్తువులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మాయ మాటలతో మభ్యపెట్టి కొత్త తరహా టెక్నిక్ లతో కొల్లగొడతారని తెలిపారు. ఎటువంటి సంబంధం లేని వాళ్లు మనకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చేయరని గ్రహించాలని తెలిపారు. సైబర్ నేరల బారిన పడిన బాధితులు తొందరగా పోలీస్ ఫిర్యాదు చేయాలని సిబ్బందిని స్పందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు. వాహన యజమానులు మైనర్ వాహనాలు ఇవ్వరాదని అది చాలా ప్రమాదకరమైన చర్య అని పేర్కొన్నారు. నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు రోడ్లపై నడిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు పోలీస్ నిబంధనలు పాటించాలని ప్రమాదాలకు దూరంగా ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మండలంలోని అన్ని గ్రామాల రోడ్లపై బ్రీత్ అనలైజర్ తో చెకింగ్ లు చేస్తామని పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమంలో కుంటాల పోలీస్ సిబ్బంది గ్రామస్తులు నాయకులు యువకులు పాల్గొన్నారు