భైంసా పట్టణం కాలనిలో ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి
పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల ఘాతుకాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది!
ఈ సందర్బంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ
మతం పేరుతో ఉగ్రవాదులు చేసిన దారుణ మారణకాండను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది!
పాశవిక మారణకాండకు తెగబడ్డ నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.
ఉగ్రవాదులు చేసిన ఇటువంటి నరమేధానికి బలైన కుటుంబాలకు మనో దైర్యం అందిస్తున్నాం.
కాశ్మీర్ లోని పహల్గాంలో అమాయక పర్యటకులపై ఉగ్రవాదులు చేసిన పాశవిక హత్యాకాండ అత్యంత దుర్మార్గం.
అత్యంత కర్కశంగా రక్తపాతం సృష్టించిన నేరస్తుల చర్యలు ఎంతమాత్రమూ ఉపేక్షించదగినవి కావు అని వారు కొనియాడారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ప్రపంచ వినాశనానికే దారిస్తుందని
దేశ ప్రజల మధ్య శాంతి, సమైక్యతలకు తీవ్ర నష్టం కలిగించే ఇటువంటి చర్యలకు, వ్యక్తులకు,సంస్థలకు ఎంతమాత్రమూ చోటు ఇవ్వకూడదని జనసేన తమ గొంతును వినిపిస్తుంది.
ప్రజలను భయాందోళనకు, అభద్రతా భావానికి లోను చేసే ఇటువంటి నేరపూరిత ముఠాలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దాన్ని గుర్తించి రూపుమాపేందుకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలి.
మతం పేరుతో అమాయక ప్రజలపై దాడిచేసి హింసకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు పాల్గొన్నారు.