ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా సోమవారం ప్రజావాణి రద్దు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా సోమవారం ప్రజావాణి రద్దు

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, నవంబర్ 29 (మనోరంజని తెలుగు టైమ్స్)

గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో, వచ్చే సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కాలంలో ప్రజావాణి కార్యక్రమం నిలిపివేయబడుతుందని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రజావాణి కార్యక్రమాన్ని మునుపటిలాగే పునఃప్రారంభిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా, అనవసర రాకపోకలు నివారించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment