కీలక అంశాలపై చర్చిస్తున్న మంత్రి మండలి
సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మంత్రి మండలి పలు కీలక అంశాలపై చర్చిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలు, గిగ్ వర్కర్స్ పాలసీ ఆమోదంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు గోశాలల పాలసీ, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి మండలి చర్చిస్తోంది. రాష్ట్రంలో యూరియా కొరత, డిమాండ్ పైనా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నా