- వానల్పాడ్ ప్రభుత్వ జెడ్పిహెచ్ పాఠశాలకు నీటి సమస్య
- 11,000 రూపాయలతో కొత్త విద్యుత్ మోటార్ అందజేత
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల కృతజ్ఞతలు
భైంసా : సెప్టెంబర్ 25
భైంసా: మంగాయి సందీప్ రావు వానల్పాడ్ ప్రభుత్వ జెడ్పిహెచ్ పాఠశాలకు 11,000 రూపాయలతో కొత్త విద్యుత్ మోటార్ అందజేశారు. గత కొద్ది రోజులుగా నీటి సమస్య ఎదుర్కొంటున్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ముఖ్యాధ్యాపకులు, గ్రామ మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
భైంసా మండలంలో వానల్పాడ్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య ఏర్పడింది. బోర్వెల్ లోని విద్యుత్ మోటారు చెడిపోవడం వలన విద్యార్థులు తాగునీటి, ఇతర అవసరాల కొరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గ్రామ మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి ద్వారా మంగాయి ఫౌండేషన్ చైర్మన్ సందీప్ రావుకు చేరింది. ఆయన తక్షణమే స్పందించి పాఠశాలకు 11,000 రూపాయలతో కొత్త విద్యుత్ మోటార్ అందించారు. ఈ చర్య పాఠశాల విద్యార్థుల మున్ముందు నీటి సమస్యలను పరిష్కరించగలదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మరియు గ్రామస్థులు ఈ దాతకు కృతజ్ఞతలు తెలిపారు.