హైదరాబాద్, 2026-06-05
ప్రధానమంత్రి ఉజ్వల యోజన () లబ్ధిదారులకు ముఖ్య గమనిక. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ - ప్రక్రియను ఆగస్టు 16, 2026లోగా పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ గడువులోగా పూర్తి చేయని వారికి సబ్సిడీ ప్రయోజనాలు నిలిపివేయబడతాయి.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన () లబ్ధిదారులు ఆగస్టు 16, 2026లోగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ - తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచించాయి. ఇప్పటికే - పూర్తి చేసుకున్న వారికి ఈ నిబంధన వర్తించదు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయని వారు సబ్సిడీ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.
సబ్సిడీపై ప్రభావం
గడువు దాటితే సబ్సిడీ ధరకు గృహ వినియోగ సిలిండర్ పొందే అర్హత కోల్పోవచ్చని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వినియోగదారులకు సందేశాలు పంపాయి. కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 నుంచి లబ్ధిదారులకు ఆధార్ బయోమెట్రిక్ -ను తప్పనిసరి చేసింది.
ప్రస్తుత సబ్సిడీ వివరాలు
ప్రస్తుతం ఉజ్వల పథకం కింద 14.2 కిలోల సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ లభిస్తోంది. అయితే, ఈ ఏడాది సబ్సిడీ వర్తించే రీఫిల్లుల సంఖ్యను 9 నుంచి 4కు తగ్గించారు. - పూర్తి చేయని వారు మార్కెట్ ధరకు సిలిండర్ కొనుగోలు చేయాల్సి రావచ్చని పేర్కొన్నారు. కమర్షియల్ ధర వర్తిస్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
- పూర్తి చేసే విధానం
ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వంటి సంస్థలు తమ మొబైల్ యాప్‌ల ద్వారా లేదా సమీప గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, డెలివరీ సిబ్బంది సహాయంతో - పూర్తి చేసుకునే సదుపాయాన్ని కల్పించాయి. ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసి ఉంటే, ముందుగా దానిని అన్‌లాక్ చేసిన తర్వాతే - విజయవంతంగా పూర్తవుతుందని అధికారులు సూచించారు.












