న్యూఢిల్లీ, 2024-07-25
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన 20 ఏళ్ల వాణిజ్య కార్యకలాపాల మైలురాయిని పురస్కరించుకుని ప్రయాణికులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇండిగో ఫ్రీ పేరుతో 20,000 ఉచిత టికెట్లను అందించడంతో పాటు, అర్హులైన వారికి రూ.10,000 వరకు రీఫండ్ కూడా ఇవ్వనుంది.
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, ప్రయాణికులకు భారీ ఆఫర్‌గా ఇండిగో ఫ్రీ పేరుతో 20,000 ఉచిత టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 6 వరకు దేశీయ విమాన టికెట్లను నేరుగా బుక్ చేసుకున్న అర్హులైన ప్రయాణికులకు గరిష్ఠంగా రూ.10,000 వరకు రీఫండ్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది.












