బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
రాజన్న ఆలయం మూసివేతపై ఆగ్రహం – “పంచలు కట్టి తలుపులు తెరుస్తాం” హెచ్చరిక
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – అక్టోబర్ 09
బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ రాజన్న ఆలయం దర్శనాలను నిలిపివేసి, భీమేశ్వరాలయంలో ప్రారంభించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రాజన్న మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు? భక్తుల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాలను భరించం. ఆలయం మూసివేస్తే పంచలు కట్టి తలుపులు తెరిస్తాం,” అని బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
“ఫైరింగ్ చేస్తారో, లాఠీచార్జ్ చేస్తారో చూద్దాం! ప్రభుత్వాలు వస్తాయి పోతాయి… కానీ మేము భక్తులకు అండగా ఉంటాం,” అని ఆయన స్పష్టం చేశారు.
బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.