- BSNL లోగోలో రంగుల్లో మార్పులు
- 4జీ సేవలను విస్తరించే ప్రయత్నాలు
- 5జీ సేవలు 2025లో ప్రారంభం
BSNL (భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన లోగోను కొత్తగా మార్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు ధరలు పెంచడంతో, వినియోగదారులు BSNL వైపు మొగ్గుచూపుతున్నారు. సంస్థ 4జీ సేవలను మరింత విస్తరించే పనిలో ఉండగా, వచ్చే ఏడాదిలో 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్: అక్టోబర్ 23
భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన పునరుద్ధరణ ప్రయాణంలో కీలకమైన మరో అడుగు వేసింది. తాజాగా, సంస్థ తన లోగోను మార్పు చేసి, కాషాయం, తెలుపు, గ్రీన్ రంగులతో కొత్త రూపాన్ని తెచ్చింది. 4జీ సేవలను విస్తరించేందుకు సంస్థ దేశవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు రీఛార్జ్ ధరలను పెంచడంతో వినియోగదారులు BSNL వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని సర్కిల్స్‌లో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా, 5జీ సేవలను వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ కొత్త లోగో, BSNL యొక్క నూతన ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుందని భావిస్తున్నారు.