జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతకు బీఆర్ఎస్ బి-ఫారమ్ అందజేత
ఎన్నికల ఖర్చుల నిమిత్తం కేసీఆర్ చేతులమీదుగా ₹40 లక్షల చెక్కు ప్రదానం
హైదరాబాద్, అక్టోబర్ 14, 2025 (M4News):
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బి ఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చుల నిమిత్తం పార్టీ తరఫున ₹40 లక్షల చెక్కును కేసీఆర్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి మరియు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.