రైతన్నలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

బిఆర్ఎస్ పార్టీ నిరసనలో సియం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
  • రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • రుణమాఫీ అమలులో విఫలమైన ప్రభుత్వం
  • బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, సియం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

బిఆర్ఎస్ పార్టీ నిరసనలో సియం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

బిఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని కొండమల్లేపల్లి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టినందుకు నిరసనగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రుణమాఫీ అమలులో విఫలమైన ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ ఇచ్చిన రూ. 2 లక్షల రుణమాఫీ వాగ్దానాన్ని విస్మరించిందని మండిపడ్డారు.

 

కొండమల్లేపల్లి, అక్టోబర్ 21

: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని, రైతుల రుణమాఫీ అమలులో విఫలమైందని కొండమల్లేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్ మండిపడ్డారు. మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ₹15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సియం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేస్తూ, వాగ్దానాలను నిలబెట్టుకోకుండా రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 2 లక్షల రుణమాఫీ చెబుతు దాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టపోయారని దస్రు నాయక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతు సహకార సంఘం అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, గుండెబోయిన లింగం యాదవ్, రావుల సత్యనారాయణ, పెద్ది శెట్టి సత్యం, దాచేపల్లి నరేందర్, తోటపల్లి శ్రీనివాస్, ముడిగే శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment