హైదరాబాద్: అక్టోబర్ 07
ఈరోజు, తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా, మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ, “నేను కేవలం మనమరాలు శుభలేఖ ఈయడానికి వచ్చాను” అని పేర్కొన్నారు.
అయితే, తీరా తీగల కృష్ణారెడ్డి టిడిపిలో చేరతారని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమం రాజకీయ వాతావరణానికి మరింత ఉత్కంఠ రేపుతోంది.