వానకాలం రైతు భరోసా ఎగవేతపై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

వానకాలం రైతు భరోసా నిరసన

M4 న్యూస్ (ప్రతినిధి)

హైదరాబాద్: అక్టోబర్ 19
వానకాలం ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఎగవేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగిందని వెల్లడించారు.

కేటీఆర్ మండిపడుతూ, “ఎకరానికి రూ. 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ రైతులను మోసం చేసింది. రుణమాఫీ మోసంతో పాటు, ఇప్పుడు రైతు భరోసాలోనూ ఎగవేస్తుంది,” అని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇలాంటి దగా మరింత జరిగితే ప్రజలు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తారని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment