H-1B visa: హెచ్-1బీపై ట్రంప్ పిడుగు.. భారత ఐటీ రంగానికి భారీ దెబ్బ.. మ‌న టెక్కీలకు బ్రిటన్ రెడ్ కార్పెట్

H-1B visa: హెచ్-1బీపై ట్రంప్ పిడుగు.. భారత ఐటీ రంగానికి భారీ దెబ్బ.. మ‌న టెక్కీలకు బ్రిటన్ రెడ్ కార్పెట్

H-1B visa: హెచ్-1బీపై ట్రంప్ పిడుగు.. భారత ఐటీ రంగానికి భారీ దెబ్బ.. మ‌న టెక్కీలకు బ్రిటన్ రెడ్ కార్పెట్

హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ ప్రభుత్వం

భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణుల ఆందోళన

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి

ప్రస్తుతం హెచ్-1బీ వీసాల్లో 71 శాతంతో భారతీయులే అగ్రస్థానం

ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వీసా ఫీజు రద్దు యోచనలో బ్రిటన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఒకేఒక్క నిర్ణయం భారత ఐటీ రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ.83 లక్షలు) పెంచడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయం భారత ఐటీ నిపుణుల అమెరికా కలను ప్రశ్నార్థకం చేయనుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భారత ఐటీ పరిశ్రమకు అమెరికా మార్కెట్ వెన్నెముక లాంటిది. మన దేశ మొత్తం ఐటీ వ్యాపారంలో 57 శాతం వాటా అమెరికాదే. గత ఏడాది జారీ అయిన హెచ్-1బీ వీసాలలో ఏకంగా 71 శాతం భారతీయులే దక్కించుకున్నారు. తాజా నిర్ణయంతో ఈ రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయుల అమెరికా కల మరింత సంక్లిష్టంగా మారిందని జెన్సార్ టెక్నాలజీస్ సీఈవో గణేష్ నటరాజన్ వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలపై స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ వైట్‌హౌస్ ఒత్తిడి పెంచుతోంది.

అమెరికా ఇటువంటి కఠిన నిబంధనలు విధిస్తుండగా, బ్రిటన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన మార్గంలో పయనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులను తమ దేశానికి ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి సైన్స్, టెక్నాలజీ నిపుణుల కోసం వీసా ఫీజును పూర్తిగా రద్దు చేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో “గ్లోబల్ టాలెంట్ టాస్క్‌ఫోర్స్‌”ను కూడా ఏర్పాటు చేశారు. అమెరికా వర్క్‌ వీసా కార్యక్రమాలు, సాఫ్ట్‌ వేర్‌ ఔట్‌ సోర్సింగ్‌, వ్యాపార సేవలు తదితరాల రూపంలో భారత ఐటీ సెక్టార్‌ 283 బిలియన్‌ డాలర్ల(రూ.25 లక్షల కోట్లు) వ్యాపారం చేస్తోందని, తాజా పరిణామాలతో దీనిపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు తెలిపారు.

భారత్ టెక్కీలకు బ్రిటన్ ఆశాకిరణం!
ఒకవైపు అమెరికా హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచి షాక్ ఇస్తుంటే, మరోవైపు బ్రిటన్ ప్రతిభావంతులకు రెడ్ కార్పెట్ పరుస్తుండటం గమనార్హం. ఈ పరిణామాలతో భవిష్యత్తులో భారత ఐటీ నిపుణులు అమెరికాకు బదులుగా బ్రిటన్ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment