అమ్మవారి సన్నిధిలో బ్రహ్మశ్రీ గోవిందహరి
బాసర మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 12
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ధార్మిక సలహదారు బ్రహ్మశ్రీ గోవింద హరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 17 నుండి 19 వరకు తెలంగాణ రాష్ట్ర విజయ యాత్రలో భాగంగా అమ్మవారి ఆలయానికి దక్షిణామ్నయ శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి రానున్నారు. దీంతో ఏర్పాట్ల నిమిత్తము బ్రహ్మశ్రీ గోవింద హరి వచ్చారు. శృంగేరి జగద్గురువుల ఆగమన ఏర్పాట్ల కోసం ప్రత్యేక సమావేశం దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్ ఆలయ కార్యనిర్వహణ అధికారి అంజనీ దేవి, ఏఈఓ ఆలయ వైదిక కమిటీతో నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆలయ వైదిక కమిటీ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.