ఢిల్లీ మెట్రో స్టేషన్లో కండోమ్ బాక్స్ కలకలం
ఢిల్లీ మెట్రో స్టేషన్ గేట్ వెనుక కండోమ్ బాక్స్ కనిపించడంతో కలకలం రేగింది. తెరిచి చూడగా అందులో అనేక కండోమ్ ప్యాకెట్లు ఉన్నట్లు తెలిసింది. ఒక వినియోగదారుడు ఈ విషయాన్ని రెడిట్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఢిల్లీ మెట్రో ప్రజారోగ్య ప్రచారంలో భాగంగా కండోమ్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించిందని పేర్కొన్నారు. మరికొందరు ప్రయాణికుల స్పందనపై ఆసక్తి చూపుతున్నారు.