నర్సంపేట లో సీఎం పర్యటనకు బందోబస్తు పరిశీలన
రేపు కాజీపేటలోని పీ.జి.ఆర్ గార్డెన్స్ లో జరగబోయే నర్సంపేట శాసనసభ్యులు దొంతుమాధవరెడ్డి మాతృమూర్తి దశ దిన ఖర్మ కార్యక్రమంకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులు, ఇతర సంబంధిత పోలీసులు క్షేత్ర స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సీపీ ఈ సందర్బంగా ముఖ్యమంత్రి భద్రత కోసం అవసరమైన చర్యలపై వివిధ సూచనలు చేశారు.