అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు
ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 18
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరు చల్లగా ఉండాలని, అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితి, ఇందులో భాగంగానే రబింద్ర ఉన్నత పాఠశాల ముధోల్లో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిలాగా అలంకరణతో విద్యార్థునులు రాగా పోతరాజుల వేశాల్లో విద్యార్థులు ఆలరించారు. బ్యాండు మేళాలతో ఆట పాటలతో బోనాల పండుగను నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో చక్కగా ముస్తాబై వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలతో అదరగొట్టారు. పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టేనని, ఆశాడమాసంలో విపరీతమైన వర్షాలు కురవాలని, ప్రజలందరు చల్లగా ఉండాలని కోరుతూ ఉత్సవాలు నిర్వహిస్తారని, పాడిపంటలు- సుఖ శాంతులతో రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహిసామని అన్నాడు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్, చైర్మన్ భీంరావ్ దేశాయ్ పోతన్న యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు