దహగాం గ్రామంలో రక్తదాన శిబిరము

దహగాం గ్రామంలో రక్తదాన శిబిరము

దహగాం గ్రామంలో రక్తదాన శిబిరము

మనోరంజని ( ప్రతినిధి )

తానుర్ : జనవరి 17

అనంత శ్రీ విభూషిత జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రచర్య మహారాజ్- కాణిఫానాథ్ మహారాజ్ ఆశీస్సులతో శుక్రవారం నిర్మల్ జిల్లా సేవా సమితి ఆధ్వర్యంలో తానూర్ మండలంలోని దహాగాం గ్రామంలో జగద్గురు నరేంద్రచర్య మహారాజ్ సంస్థాన్ అంతర్గతంగా గల తెలంగాణ ఉపపీఠము ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో భాగంగా దహగాం గ్రామపంచాయతీ ఆవరణలో రక్తదాన శిబిరము ఏర్పాటు చేశారు.

ఈ శిబిరానికి ప్రత్యేక ఆహ్వానితులుగా భారతీయ జనతా పార్టీ తానూర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా సేవా సమితి పదాధికారులందరూ పాల్గొన్నారు.

తెలంగాణ ఉపపీఠం సభ్యులు కాంశెట్టి శ్రీనివాస్ మార్గదర్శనం చేస్తూ..జగద్గురు నరేంద్ర చార్య మహారాజ్ ఆదేశానుసారంగా జనవరి 4 నుండి 19 వ తేదీ వరకు స్వామీజీ ఆశీస్సులతో భారతదేశం అంతట రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని స్వామీజీ సంకల్పంలో భాగంగా ఒక లక్ష ప్యాకెట్స్ ప్రభుత్వానికి ఇవ్వడానికి సంకల్పంలో భాగంగా నేటి వరకు 95491 దాతల ద్వారా పూర్తి చేయడం జరిగిందని మిగతా ఈ రెండు మూడు రోజుల్లో లక్షకు పైగా రక్తదాన ప్యాకెట్స్ పూర్తి చేసి స్వామీజీ సంకల్పం విజయవంతం చేయాలని దేశంలోని కార్యకర్తలు అంతా నిస్వార్ధంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులనుదేశించి మార్గదర్శనం చేయడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment