రాష్ట్రంలో ఇకపై అన్ని ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
స్థానిక సంస్థల ఎన్నికలు అత్యవసరమని అవి జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇటీవల ప్రభుత్వంగా జారీ చేసిన జీవోను స్వాగతిస్తున్నామనీ, తమ పార్టీ మొదటి నుంచి దీనికి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం సాకులతో కాలయాపన చేసినట్లుగా విమర్శించారు. ఇకపై రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు