భైంసా : అక్టోబర్ 28
ప్రతి గ్రామంలో బిజెపి క్రియాశీలక సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి సూచించారు.. సోమవారం భైంసా లోని ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో ఏర్పాటు చేసిన మండల ఇంచార్జి ల సమావేశం లో క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. వందమంది సభ్యత్వ నమోదు చేసిన వారికి మాత్రమే పార్టీ సంస్థాగతంగా పదవులు ఇవ్వబడతాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సభ్యత్వ నమోదు చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు.గ్రామ గ్రామ న సభ్యత్వ నమోదుకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు.. నవంబర్ 5 వరకు క్రియాశీల, ప్రాథమిక నమోదు సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయడానికి సభ్యత్వ నమోదు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా క్రియాశీల సభ్యత్వ నమోదు ఇంచార్జ్ సామ రాజేశ్వర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సాగర్, బిజెపి నియోజకవర్గ అసెంబ్లీ కో కన్వీనర్ సుమన్, బిజెపి సభ్యత్వ నమోదు జిల్లా కోఆర్డినేటర్ సిరం సుష్మ రెడ్డి,భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బిజెపి పట్టణ అధ్యక్షులు మల్లేష్, మండల అధ్యక్షులు భూమేష్ కుభీర్ మండల అధ్యక్షులు యేశాల దత్తాత్రి,, జిల్లా కార్యదర్శి నల్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు