స్టానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధం.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తీసువచ్చిన 2.0 జీఎస్టీ సంస్కరణల అమలు తీరు పై బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి చెన్నూర్ పట్టణం గాంధీ చౌక్ లో పలు షాపులకు వెళ్ళి నూతన జీఎస్టీ ధరలు అమలు పై దుకాణదారులకు అడిగి తెలుసుకుని ప్రజలకు ప్రస్తుత జీఎస్టీ తగ్గింపు ధరలను ప్రజలకు అందించాలని దుకాణదారులకు సూచించడం జరిగినది. అనంతరం పట్టణంలో మార్వాడీ భవన్ ఇటీవల రఘునాథ్ వెరబెల్లి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియామకం అయిన సందర్భంగా వారికి చెన్నూర్ నియోజవర్గ బీజేపీ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించడం జరిగింది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కార్యకర్తలు అందరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యి ప్రజా సమస్యలపై పోరాడాలని రఘునాథ్ పిలుపునిచ్చారు