జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గడప గడపకు ప్రచారం

జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గడప గడపకు ప్రచారం

బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు కోరిన మహేశ్వర్ రెడ్డి – కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు

మనోరంజని, తెలుగు టైమ్స్, హైదరాబాద్ ప్రతినిధి — అక్టోబర్ 29
జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గడప గడపకు ప్రచారం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు.
జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గడప గడపకు ప్రచారం

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి గారు, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

అతను మాట్లాడుతూ, “ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రెండేళ్లు గడిచినా ప్రజలకు ఏమాత్రం ఉపశమనం కలగలేదు. అవినీతి, అరాచకాలు, కుంభకోణాలు విపరీతంగా పెరిగిపోయాయి. మంత్రులు, ముఖ్యమంత్రి కమీషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపడం లేదు,” అని విమర్శించారు.

మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టిందని పేర్కొన్నారు. “జూబ్లీహిల్స్ ప్రజలు లంకల దీపక్ రెడ్డిని గెలిపిస్తే, బీజేపీ తరపున మరో ప్రజా గొంతుకగా మాకు బలం చేకూరుతుంది,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment