మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల

మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో విడుదల, అమిత్ షా
  • బీజేపీ సంకల్ప పత్రాన్ని అమిత్‌ షా విడుదల
  • రైతులు, మహిళలు, యువతకు ప్రత్యేక హామీలు
  • బీజేపీ మేనిఫెస్టోలో పది గ్యారంటీలు

 మహారాష్ట్రలో బీజేపీ పార్టీ సంకల్ప పత్రం (మేనిఫెస్టో)ను అమిత్‌ షా విడుదల చేశారు. రైతులు, మహిళలు, యువతకు పలు కీలక హామీలను అందించిన బీజేపీ, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు రూ.10,000, మహిళలకు నెలకు రూ.2,100, ఆశా వర్కర్లకు రూ.15,000 వేతనం వంటి ప్రతిపాదనలు చేసింది. 5 ఏళ్లలో 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 మహారాష్ట్రలో బీజేపీ పార్టీ తమ సంకల్ప పత్రాన్ని (మేనిఫెస్టో) అమిత్‌ షా విడుదల చేశారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఈ పత్రంలో పది ప్రధాన గ్యారంటీలను ప్రకటించారు. రైతుల కోసం రుణాల మాఫీ, విద్యార్థులకు నెలకు రూ.10,000 స్టైపెండ్‌ ఇవ్వడం, మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సహాయం అందించడం వంటి కీలక ప్రతిపాదనలను బీజేపీ ముందుకు తెచ్చింది.

అదనంగా ఆశా వర్కర్లకు నెలకు రూ.15,000 వేతనం, మహిళా పోలీసు విభాగంలో 25,000 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు కల్పించడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. మహారాష్ట్ర యువతకు 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలను అందించడానికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీతో 45,000 గ్రామాలకు కనెక్టవిటీ కల్పించడం, కరెంటు చార్జీలలో 30 శాతం రాయితీ వంటి వాగ్దానాలు చేసినట్లు అమిత్‌ షా తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment