- బిజెపి నాయకులు జగదంబ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
- సంతు సేవాలాల్, సంతు శ్రీ రామారావు మహారాజు సమాధిని సందర్శించారు
- మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన బాబులాల్ మహారాజ్ కి శుభాకాంక్షలు
భైంసా జిల్లా పౌరా దేవిలో ఉన్న జగదంబ అమ్మవారిని బిజెపి నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బంజారాల దైవం శ్రీ సంత్ సద్గురు రామ రావు మహారాజ్ వారసుడు సంతు శ్రీ బాబు సింగ్ మహారాజు ఆధ్యాత్మిక సేవలను గుర్తించి, బాబులాల్ మహారాజ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
భైంసా, అక్టోబర్ 20
: వాసిం జిల్లాలోని పౌరా దేవిలో వెలిసి ప్రసిద్ధిగాంచిన జగదంబ అమ్మవారిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర నాయకులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, సంతు సేవాలాల్ మరియు సంతు శ్రీ రామారావు మహారాజు సమాధిని కూడా సందర్శించి, ఆధ్యాత్మిక సేవలను నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన బాబులాల్ మహారాజ్ కి శుభాకాంక్షలు తెలిపి, బంజారా సాంప్రదాయానికి అనుగుణంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బంజారా ముద్దుబిడ్డ జాదవ్ రాజేష్ బాబు, పట్టేపూర్ సతీష్ రెడ్డి, జాదవ్ సురేష్, బంజారా యువ నాయకులు రాజేందర్ రాథోడ్, ఆడే బలరామ్, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.