నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చ – రాత్రికే ప్రకటన అవకాశం


న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (మనోరంజని తెలుగు టైమ్స్):

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్లమెంటరీ బోర్డు భవన్‌లో జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు.

సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొననున్నారు. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో పాటు తెలంగాణ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎంపికపైనా ఈ భేటీలో చర్చ జరగనుంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈరోజు రాత్రికే జూబ్లీహిల్స్ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. పార్టీ ఉన్నత నాయకత్వం వివిధ అభ్యర్థుల సామర్థ్యం, స్థానిక మద్దతు వంటి అంశాలను పరిశీలిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment