డాక్టర్: ఏ.ఎస్. రావు గారి బయోపిక్ చిత్ర ప్రదర్శన

డాక్టర్ ఏఎస్ రావు బయోపిక్ ప్రదర్శన

సీఐటీయూ ప్రధాన కార్యదర్శి: బంగారు నర్సింగ్ రావు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

మల్కాజిగిరి: అక్టోబర్ 22, 2024: నేరేడ్మెట్ డివిజన్, ఆర్కే పురం-హరిజన బస్తి దగ్గరని పోచమ్మ టెంపుల్ వద్ద డాక్టర్ ఏఎస్ రావు గారి బయోగ్రఫీ డాక్యుమెంటరీ సినిమా ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమం గురించి సిఐటీయూ మల్కాజిగిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు తెలియజేశారు.

డాక్టర్ ఏఎస్ రావు బయోపిక్ ప్రదర్శన

ఈ సందర్భంగా విజ్ఞాన దర్శిని నాయకులు టి రమేష్ మాట్లాడుతూ, “మహా మనిషి, గొప్ప సాంకేతిక విప్లవ స్ఫూర్తి దాత డాక్టర్ ఏఎస్ రావు గారు” అని కొనియాడారు. దేశ స్వాలంబన కోసం ఈసీఐఎల్ నిర్మాణానికి నాంది పలికిన మహోన్నత వ్యక్తిగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా భావించాలని విజ్ఞాన దర్శిని-టిపిఎస్‌కే ఆధ్వర్యంలో చిత్ర ప్రదర్శన జరుగుతోందన్నారు.

తదనంతరం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం జిల్లా అధ్యక్షులు శ్రీ యాదగిరి రావు మాట్లాడుతూ, “డాక్టర్ ఏఎస్ రావు గారి బయోపిక్ ఒడిస్సా ప్రభుత్వం ద్వారా ప్రాంతీయ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు అందుకుంది” అని చెప్పారు.

డాక్టర్ ఏఎస్ రావు చిన్ననాటి నుంచే అనేక సమస్యలను ఎదుర్కొని, అగ్రవర్ణంలో పుట్టిన కులపరమైన వివక్షను ఎదుర్కొన్న వ్యక్తి అని వారు తెలిపారు. ఉన్నత చదువులు చదివిన ఆయన మూఢ, అంధ విశ్వాసాలకు, మత క్రతువులకు వ్యతిరేకంగా నిలబడిన మహోన్నత వ్యక్తి అని వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుమిత్ర, వైష్ణవి, సునంద, సత్యవతి, దీప, సునీత, మంగమ్మ, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment