- 2025లో మిడ్ లెవల్ ఇంజినీర్లను AIతో భర్తీ చేయనున్న మెటా
- మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటన టెక్ ప్రపంచంలో కలకలం
- కాంప్లెక్స్ టాస్కులను AI సిస్టమ్స్ హ్యాండిల్ చేయగలవు
- సాప్ట్‌వేర్ ఇంజినీర్లకు రానున్న రోజుల్లో తీవ్రమైన సవాళ్లు
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రకటనతో టెక్ ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. 2025 నాటికి మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్ల స్థానాన్ని AI టెక్నాలజీ భర్తీ చేస్తుందని చెప్పారు. కోడింగ్ వంటి కాంప్లెక్స్ టాస్కులను AI సిస్టమ్స్ చేయగలవని తెలిపారు. టెక్ రంగంలోని ఇంజినీర్లు ఈ మార్పులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
సాప్ట్‌వేర్ ఇంజినీర్లకు షాక్ – 2025లో మిడ్ లెవల్ ఉద్యోగాలను AIకి భారం
సాప్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ భద్రతపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రకటనను మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేశారు. 2025 నాటికి మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మెటా సహా పలు టెక్నాలజీ కంపెనీలు ప్రస్తుతం కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను సులభతరం చేసే AI సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.
జుకర్‌బర్గ్ ప్రకటన టెక్ రంగంలోని ఉద్యోగుల మధ్య ఆందోళనను రేకెత్తించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, డీబగింగ్ వంటి ముఖ్యమైన కోడింగ్ టాస్కులను నిర్వహించగల AI సిస్టమ్స్ అభివృద్ధి చెందడంతో మానవ జోక్యానికి అవసరం తగ్గుతుందన్నది స్పష్టమవుతోంది.
ఈ మార్పులతో మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో టెక్ ఉద్యోగులు AI తో పోటీ పడేందుకు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.